- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో 872కు చేరిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు గతవారం రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. రోజుకు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ఇదే రీతిలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 24గంటల్లో కొత్తగా 1,396 కేసులు నమోదవ్వగా, 48 మరణాలు సంభవించాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27,892కు చేరగా, మృతుల సంఖ్య 872కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం 20,835 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,185మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించింది. అయితే, కోవిడ్ 19 బారినపడినవారి మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా 7శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 3.1శాతమే ఉందని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 283జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాకపోగా, మరో 64జిల్లాల్లో వారంరోజులుగా కొత్త పాజిటివ్ కేసులేవీ వెలుగుచూడలేదని తెలిపారు.
Tags: corona cases in india, corona deaths, union health ministry, corona, virus, covid 19, harsha vardhan, positive cases