ఉమ్మడి నిజామాబాద్‌లో 85 కేసులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 131 కొత్త కేసులు రాగా, ఆదివారం 85 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిజామాబాద్ కోవిడ్ అసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న 8 మంది చనిపోయారు. దీంతో జిల్లాలో మొత్తం 1224 కేసులు అయ్యాయి. నిజామాబాద్ నగరంలో కరోనా పంజా విసరడంతో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వారంలోనే వెయ్యికి చేరువైన ఆశ్చర్య పోనక్కర్లేదని పలువురు అంటున్నారు.

Advertisement