ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది మావోయిస్టులు అరెస్టు

by Sridhar Babu |
ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది మావోయిస్టులు అరెస్టు
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో 8 మంది కీలక మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్‌పల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల సందర్భంగా భద్రతా బలగాలు 8 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరంతా పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అంగీకరించడంతో అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్లు
పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed