- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ శర్మ సహా ఆ 8 మందికి విశ్రాంతి?
దిశ, స్పోర్ట్స్ : సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టీమ్ ఇండియాలోని కీలక సభ్యులకు ఇంగ్లాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నది. గత ఏడాది కరోనా కారణంగా క్రికెట్ నిబందనలు తాత్కాలికంగా మార్చారు. దీనిలో భాగంగా ప్రతీ మ్యాచ్ బయోబబుల్ వేదికలోనే జరుగుతున్నది. గత ఐపీఎల్ నుంచి టీమ్ ఇండియా క్రికెటర్లు వరుసగా క్రికెట్ ఆడుతున్నారు. ఐపీఎల్ అనంతరం యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లారు. సుదీర్ఘ పర్యటన అనంతరం టీమ్ ఇండియా తిరిగి స్వదేశానికి వచ్చినా.. కేవలం రెండు వారాల విశ్రాంతి అనంతరం ఇంగ్లాండ్ సిరీస్ కోసం తిరిగి బయోబబుల్‌లోకి వచ్చింది.
క్రికెటర్లు సుదీర్ఘ కాలం బయోబబుల్‌లో ఉండటం వల్ల తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్పడంతో కొంత మందికి విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే తనకు విశ్రాంతి కల్పించాలని కోరడంతో బుమ్రాను జట్టు నుంచి తప్పించారు. అలాగే వన్డే సిరీస్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ సహా మొత్తం 8 మందికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వన్డే సిరీస్ ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ 14వ సీజన్ కూడా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.