- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 11 మందికి కరోనా
దిశ, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా 8 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మంగళవారం ఉదయం తరువాత వచ్చిన పరీక్ష రిపోర్టుల ఆధారంగా అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్లో 3 కేసులు నమోదు కాగా గద్వాలలో 8 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ పట్టణంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా నమోదైన మూడు కేసులు కూడా మర్కజ్ నుండి వచ్చిన వారి ద్వారా ఇతరులకు సోకినవిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు కేసుల్లో 23 రోజుల పసికందు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బికే రెడ్డి కాలనీ,మర్లు ప్రాంతాల నుంచి రాకపోకలను పరిమితం చేయటమే కాకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలను పిచికారి చేయించినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలలోని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తిస్తున్నామని, అలా గుర్తించిన వారందరిని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
గద్వాలలో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని 2, గద్వాల నియోజకవర్గ పరిధిలో 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి జోగులాంబ గద్వాల జిల్లాలో 18 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అయినట్లు తెలుస్తోంది.
Tags: corona virus,Mahabubnagar,8 corona positive cases