- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు: కలెక్టర్ ఫారుఖీ
దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని ఏడు కంటైన్మెంట్ జోన్లలో బారికేడ్లను తొలగించి, సడలింపులు ఇచ్చినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. పట్టణంలో కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించిన జవహర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం బారికేడ్లను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా 16 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందులో జవహర్‌నగర్, గాజులపేట, కనకాపూర్, రాచాపూర్, న్యూలింగంపల్లి రాయదారి, కడెం కంటైన్మెంట్ జోన్లలో ఒక్కో పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని తెలిపారు. 14 రోజులు పూర్తయినందున బారికేడ్లను తొలగించామన్నారు. జిల్లాలో యాక్టివ్ కేసులు తగ్గిపోయాయని తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన 20 మందిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపగా అందులో ఎనిమిది మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నందున క్రమంగా సడలింపులు ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో సాధారణ లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్, ఎస్పీ శశిధర్ రాజు, అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ వెంకట్ రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంత రావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి కార్తీక్ పాల్గొన్నారు.
Tags: Nirmal, collector, musharraf farooqi, continement areas, Pull Out