- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్కరోజే 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా.. సుప్రీంకు కేంద్రం నివేదిక!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఢిల్లీలో ప్రతీ నలుగురిలో ముగ్గురికి పాజిటివ్ వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఆక్సిజన్, బెడ్ల కొరత ఢిల్లీలో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల మరణాలు కూడా రెట్టింపు సంఖ్యలో పెరుగుతున్నాయి.
ఢిల్లీలో కరోనా చైన్ లింక్ కట్ చేసేందుకు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు వారాలుగా లాక్‌డౌన్‌ను పొడగిస్తూ వస్తోంది. అయినప్పటికీ రోగులకు ఆక్సిజన్ సరఫరా అందక చాలా మంది మరణిస్తున్నారు. ఈ విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేంద్రాన్ని నివేదిక కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ఒక్కరోజే ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్లు కేంద్రం నివేదిక రూపంలో సుప్రీంకు తెలిపింది. 50 ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించాకే ఆక్సిజన్ పంపిణీ చేసినట్లు కేంద్రం స్పష్టంచేసింది.