- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పగబట్టిన కరోనా.. 73 మంది కూలీలకు కరోనా పాజిటివ్..!
దిశ ప్రతినిధి, పాలమూరు : తెలంగాణలో కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. తాజాగా రంగారెడ్డి ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు కరోనా బారిన పడ్డారు. గత మూడ్రోజులుగా నిర్వహించిన టెస్టుల్లో సుమారు 73 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. వివరాల్లోకివెళితే..భూత్పూర్ మండలం బట్‌పల్లి వద్ద గల కరివేన 13వ ప్యాకేజీలో 400 మందికి పైగా కూలీలు, కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళ, బుధవారాల్లో వెలువడిన ఫలితాల్లో 20 మందికి కరోనా వైరస్ నిర్దారణ అయినట్లు వైద్యులు గుర్తించారు.
భూత్పూర్ వైద్య సిబ్బంది ఈరోజు బట్‌పల్లి వెళ్లి 137 మంది కార్మికులు, కూలీలకు పరీక్షలు జరిపారు. ఇందులో ఏకంగా 53 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టుల్లో వెల్లడైంది. మూడ్రోజుల వ్యవధిలోనే రోజులలో 73 మందికి కరోనా వచ్చినట్లు తేలడంతో తోలి కార్మికులు, కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కార్మికులు, కూలీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారని సమాచారం. అయితే, మిగతా కార్మికులు, కూలీలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని, అలా చేస్తే మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలున్నట్లు వైద్య సిబ్బంది భావిస్తున్నారు.