- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
68 ఏళ్ల వయసులో 2200 కి.మీ సైకిల్ యాత్ర!
దిశ, వెబ్‌డెస్క్ : సంకల్ప బలముంటే.. వయసు అనేది జస్ట్ ఓ నెంబర్ మాత్రమేనని ఇప్పటికే ఎంతోమంది వృద్ధులు నిరూపించారు. ఇటీవలే ఓ బామ్మ 90 ఏళ్ల వయసులో పారా గ్లైడింగ్ చేసి ఔరా అనిపిస్తే, మరో బామ్మ 90లోనూ టెక్నాలజీ అంశాలను నేర్చుకుంటూ.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ముంబైకి చెందిన జోషి తాత కూడా 87 ఏళ్ల వయసులో బ్యాగులు కుడుతూ స్వయం ఉపాధిని పొందుతున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధురాలు.. 2200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకు చేస్తోంది?
చాలా మంది విదేశీయులు విరాళాలు సేకరించేందుకు సైకిల్ యాత్రలు చేస్తుంటారు. భారత్‌లో కూడా ఎన్నికల టైమ్‌లో ప్రచారంలో భాగంగా.. సైకిల్ లేదా మోటర్ సైకిళ్లపై యాత్రలు చేస్తుంటారు. అయితే ఈ బామ్మ యాత్ర మాత్రం వారందరి కంటే భిన్నం, పూర్తి ఆధ్మాత్మికం. మహారాష్ట్ర, బుల్దానా జిల్లాలోని కామ్‌గావ్ గ్రామానికి చెందిన 68 ఏళ్ల రేఖా దేవ్‌బంకర్ హిమాలయాల్లో కొలువైన శ్రీ వైషోదేవీ ఆలయానికి సైకిల్ మీద బయలుదేరింది. తన స్వగ్రామం నుంచి వైష్టో దేవీ ఆలయం 2200 కిలోమీటర్లు కాగా.. సైకిల్‌పై ఆమె ఇప్పటికే మధ్యప్రదేశ్ బోర్డర్ చేరుకుంది. రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తోంది. అలసట వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఆలయాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ రేఖ యాత్రా విశేషాలను వీడియో తీసి నెట్టింట్లో అప్‌లోడ్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. దాంతో రేఖను చాలా మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె చేస్తున్న సాహసానికి, ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్ ‘మాతృశక్తి’ పేరుతో రేఖ వీడియో, ఫొటోలను ట్రెండ్ చేస్తున్నారు. ‘ఆమెకు నా సాష్టాంగ నమస్కారాలు, మీరు దుర్గాదేవిని ఎప్పుడైనా చూశారా? ఈ నవరాత్రి టైమ్‌లో రేఖ అమ్మలో నాకు కనిపిస్తోంది. భారతీయ స్త్రీలు చాలా శక్తిమంతురాళ్లు అనడానికి రేఖ మాతనే నిదర్శనం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.