ఘోరం.. తెలంగాణలో 674 మంది బలి

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా అల్లకల్లోలం ఆగేలాలేదు. దాని కోరలకు రోజుకు వేల సంఖ్యలో ప్రజలు చిక్కుతున్నారు. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఓ పక్క కరోనా, మరో పక్క వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం ఆగమాగమైతోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో 1,921 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 88,396కు చేరింది. ఇందులో 64,284 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. కాగా, 23,438 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు.

అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 674 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదు కేసుల్లో హైదరాబాద్-356, మేడ్చల్-168, రంగారెడ్డి-134 కేసులు నమోదయ్యాయి.

Advertisement