అయోధ్యకు 613 కిలోల గంట.!

by  |
అయోధ్యకు 613 కిలోల గంట.!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజ్యలక్ష్మీ అనే మహిళ రామ జన్మభూమి అయోధ్యకు 613 కిలోల గంటను తయారు చేయించి రామేశ్వరం నుంచి తీసుకెళ్తున్నారు. ఈనెల 17న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా రామ రథయాత్ర పేరుతో రామేశ్వరం నుంచి గంటను తీసుకొని బయల్దేరిన క్రమంలో ఆదివారం నిర్మల్ జిల్లాకు చేరుకుంది.

దీంతో జిల్లా ముఖ ద్వారమైన సోన్ గోదావరి దగ్గరలోని కడ్తాల్ గ్రామంలో రామాలయం వద్ద బీజేపీ నేతలు, భక్తులు, మహిళలు స్వాగతం పలికి అయోధ్యకు తీసుకెళ్తున్న గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన రామ జన్మభూమికి తీసుకెళ్తున్న గంటను దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు గ్రామస్థులు. దక్షిణ భారతదేశం నుంచి 613 కిలోల గంటను తయారు చేయించి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి తీసుకెళ్లడం పూర్వజన్మ సుకృతమని రాజ్యలక్ష్మీ అన్నారు. స్వయంగా తానే వాహనాన్ని నడిపి 10 రాష్ట్రాల గుండా 4,552 కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. వచ్చే నెల 7న అయోధ్యకు చేరుకోనున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed