5జీ మార్కెట్‌కు భారత్ అనుకూలం : క్వాల్కమ్!

by Harish |
5జీ మార్కెట్‌కు భారత్ అనుకూలం : క్వాల్కమ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ అప్‌గ్రేడ్, చేయగలిగినంత పెద్ద మార్కెట్ ఉందని, ప్రభుత్వం, పాలసీ నిర్ణేతలు 5జీ స్పెక్ట్రమ్‌ను తగినంత పరిమాణంలో, సరసమైన ధరలకు విడుదల చేయడం ద్వారా టెలికాం రంగం వృద్ధి సాధించగలదని క్వాల్కమ్ వెల్లడించింది. 5జీ ప్రారంభంతో భారత టెలికాం మార్కెట్ సానుకూలంగా ప్రభావితమవుతుందనీ… భారత్‌లో డేటా వినియోగం పెరగడం, కరోనా మహమ్మారి కారణంగా సాంకేతిక వినియోగం అధికమవడంతో 5జీ ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని క్వాల్కమ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాడియా చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో 5జీ నెట్‌వర్క్ భారత్‌లో తక్షణం తేవాల్సిన అవసరంలేదన్నారు. అయితే, దేశ అభివృద్ధికి ముందస్తు అవసరముందని రాజెన్ పేర్కొన్నారు. 5జీ పూర్తి సామర్థ్యాన్ని అందించడంలో భారత రెగ్యులేటరీ పాత్ర కీలకమనీ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా భారత నిలవనుందని ఆయన అభిప్రాయపడ్డారు. టెలికాం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆటోమోటివ్, మెడిసిన్ నుంచి తయారీ వరకు దేశంలో 5జీ ఏ స్థాయిలో అవసరముందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని రాజెన్ వాగాడియా తెలిపారు. 5జీని అభివృద్ధి చేయడం ద్వారా భారత్‌కు ఉన్న అవకాశాల దృష్ట్యా తగిన ప్రణాళిక, చర్యలు ఉండాలని ఆయన సూచించారు. 5జీ టెక్నాలజీ ఆవిష్కరణల కోసం క్వాల్కమ్ ఇప్పటికే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు భాగస్వాములతో కలిసి పనిచేస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed