5,846 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అర్హత ఇంటర్!

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగుకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేవలం ఇంటర్ విద్యార్హతతో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ పోలీసు రిక్రూట్ మెంట్-2020 ద్వారా 5,846 పోస్టులను స్ఠాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. గడువు తేదీని సెప్టెంబర్ 7వ తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఇంటర్ విద్యార్హత అయినప్పటికీ.. 2020 జూలై 1నాటికి 18 నుంచి 25ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరిన్ని వివరాలకు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Advertisement