కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం.. ఒకే ఇంట్లో 5గురికి పాజిటివ్

by Sridhar Babu |   ( Updated:2021-08-18 09:23:03.0  )
Corona virus
X

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఒకేసారి 5గురు కరోనా బారినపడ్డారు. వివరాల ప్రకారం.. వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 5 కుటుంబసభ్యులకు గత పది రోజుల క్రితం చల్లూర్ పీహెచ్‌సీలో కరోనా టెస్టులు చేశారు. టెస్టుల అనంతరం మొదటగా ఇంట్లోని మహిళకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

అయితే సదరు మహిళలకు వైద్య సిబ్బంది చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలో మిగిలిన నలుగురు కూడా కరోనా బారినపడ్డారు. మొదట మహిళకు కరోనా సోకడంతో స్థానిక ANMకు బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు.

అయినప్పటికీ ANM సరైన వైద్య సేవలు, మందులు ఇవ్వకపోవడంతో తాము కూడా కరోనా బారిన పడినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానిక పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పాజిటివ్ వచ్చిన కుటుంబాన్ని ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఆ వార్డు ఏరియాలో పరిశుభ్రతకు కూడా కరువైంది. బాధితులకు సరైన వైద్యసేవలు అందించని అధికారులపై చర్యలు తీసుకొని కరోనా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed