మరో ప్రమాదంలో పవన్ ఫ్యాన్స్ ఐదుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్ :
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఇసుకలారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని దామెర మండలం పసరగొండ దగ్గరలో బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మృతులంతా వరంగల్ పోచమ్మ మైదాన్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు రోహిత్, రహీం, పవన్, రాకేష్, ప్రవీణ్‌గా గుర్తించారు.

వరంగల్ నుంచి పరకాల వెళ్తుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. దీంతో ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారని తెలుస్తోంది. ఇదిలాఉండగా, మృతులంతా పవన్ కళ్యాణ్ అభిమానులనీ.. ఇవాళ పవన్ పుట్టినరోజు కావడంతో సెలెబ్రేషన్ కోసమని సరదాగా కారులో వెళ్లినట్లు సన్నిహితుల సమాచారం.

కాగా మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందిన విషయం విధితమే. ఈ రెండు ఘటనల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 8 మంది మృతిచెందడం అభిమానుల్లో విషాదం నింపింది.

Advertisement