- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాక్‌డౌన్.. ఐదు ఫొటోలకు ఉత్తమ అవార్డులు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఛాయాచిత్రాల పోటీలో ఐదు ఉత్తమ ఫోటోలు ఎంపికయ్యాయి. తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన ఈ పోటీకి లాక్‌డౌన్ ఇతివృత్తంగా తీసిన 480 ఛాయాచిత్రాలు వచ్చాయి. ఇందులో మూడు ఫొటోలు బ్లూ రిబ్బన్ అవార్డుకు, మరో రెండింటికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్‌కు ఎంపికైనట్లు అకాడమీ కార్యదర్శి విశ్వేందర్ రెడ్డి తెలిపారు. షాడో అండ్ టెక్చర్ విభాగంలో చింతల రాఘవ అనే ఫోటోగ్రాఫర్‌కు బ్లూ రిబ్బన్ అవార్డు లభించింది. ఫోటోల క్వాలిటీ, టెక్నికల్ అంశాలు, ఇతివృత్తంలో ఫోటోగ్రాఫర్ ఎంచుకున్న థీమ్, లైటింగ్ తదితర ప్రత్యేకతలను ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూరీ పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపికచేసినట్లు తెలిపారు. 102 మంది ఫోటోగ్రాఫర్లు ఈ పోటీలో పాల్గొన్నారని, ఆరు అంశాల్లో ఫొటోలను ఈ పోటీకి ఆహ్వానించినట్లు తెలిపారు.