- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చౌటుప్పల్‌లో 49 కరోనా కేసులు నమోదు

X
దిశ, మునుగోడు: చౌటుప్పల్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 160 మంది పరీక్షలు చేయగా, 49 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
అంతేగాకుండా నారాయణపురం మండల కేంద్రంలో 54 మందికి పరీక్షలు చేయగా, 21 పాజిటివ్ నిర్ధారణ అయింది. నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో 76 మంది పరీక్షలు చేయగా, 15 మందికి వైరస్ సోకింది. మునుగోడు మండల కేంద్రంలో 69 మంది పరీక్షలు చేయగా, 20 మంది మహమ్మారి బారిన పడినట్టు ఆయా మండలాల వైద్యాధికారులు వెల్లడించారు.
Next Story