- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిప్పుల కొలిమిలా తెలంగాణ@46 డిగ్రీలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ హీట్ ఎక్కుతున్నాయి. మే నెల మొదటి వారంలో నార్మల్‌గా ఉన్న టెంపరేచర్ రెండో వారం దాటాక ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నడూ లేని విధంగా భానుడు సెగలు చిమ్ముతున్నాడు. ఒక్క క్షణం పవర్ పోయిందంటే చాలు జనాలు చెమటలు కక్కుతున్నారు. ఓ వైపు కరోనా..మరోవైపు ఎండలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇన్నిరోజులు నిర్బంధంలో ఉన్న ప్రజలు రాష్ట్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి రెగ్యూలర్ జీవనం సాగించానుకుంటున్నారు. కానీ, కరోనా కంటే ముందే ఎండ వేడి, వడగాల్పుల తాళలేక తిరిగి ఇళ్లల్లోకి వెళ్లిపోతున్నారు. అయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు బయటకు రావొద్దని, వచ్చినా తగు జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. గడచిన 24గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా దుండిగల్‌లో 41డిగ్రీలు రికార్డు అయింది. అదే విధంగా నిజామాబాద్‌లో-45, మెదక్-44.5, రామగుండం-44, నల్లగొండ-44, హకీంపేట-42.4, హైదరాబాద్-42.3, మహబూబ్ నగర్-42.1, ఖమ్మం-41.8, హన్మకొండ-41.5, భద్రాచలం-41.2 డిగ్రీలుగా నమోదైనట్టు సమాచారం.