మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారం 15 రెట్లు వృద్ధి!

by Harish |
మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారం 15 రెట్లు వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తులను విక్రయించే చిన్న, మధ్య తరహా వ్యాపారులు కరోనా సమయంలో భారీగా పెరిగారు. 2020లో మొత్తం 4,152 మంది భారతీయ అమ్మకందారులు రూ. కోటి విలువైన అమ్మకాలను సాధించగలిగారని అమెజాన్ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన రూ. కోటి విలువైన అమ్మకం దారుల సంఖ్య 29 శాతం పెరిగిందని అమెజాన్ తన నివేదికలో పేర్కొంది. అమెజాన్ వేదికపై అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లు తమ వ్యాపారం 135 శాతం వృద్ధిని సాధించాయని చెప్పింది.

సహేలీ కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారం 15 రెట్లు పెరిగిందని అమెజాన్ తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాది చిన్న, మధ్య తరహా వ్యాపారాల వారు డిజిటలైజేషన్ ప్రభావాన్ని ఎదుర్కొన్నారని నివేదిక అభిప్రాయపడింది. ‘భారత్‌లో అమెజాన్‌తో భాగస్వామ్యం కలిగిన 10 లక్షలకు పైగా చిన్న వ్యాపారాలను చూడగలిగాం. ఇది రాబోయే రోజుల్లో పని చేసే, జీవించే విధానాన్ని ప్రభావితం చేయనుందని’ అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ చెప్పారు.

Advertisement

Next Story