- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్ బరిలో మిగిలింది ఎంతమందో తెలుసా..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. అనంతరం తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్అధికారి వెల్లడించారు. సాగర్లో మొత్తం 77 మంది నామినేషన్లు వేయగా… 17 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక నామినేషన్ల అంకంలో చివరి రోజైన శనివారం 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 41 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్, టీఆర్ఎస్నుంచి భగత్ కుమార్, టీడీపీ నుంచి మువ్వా అరుణ్ కుమార్, ఎంఐఎం నుంచి నూరజ్ బేగం, ఎంసీపీఐ నుంచి కాశయ్య, అన్నా వైఎస్‌ఆర్ నుంచి వడ్ల శ్యామ్‌తో సహా మొత్తం 41 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్ సీఈఓ శశాంక్ గోయల్ తెలిపారు.