40 బస్తాల నల్లబెల్లం పట్టివేత

దిశ, కోదాడ: అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల బెల్లాన్ని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా కొరివి గ్రామం నుంచి మహబూబాద్ జిల్లా‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో 40 బస్తాల నల్ల బెల్లం మూడు బస్తాల పట్టికను సీజ్ చేశారు పోలీసులు. నలుగురి నిందితులు షేక్ యూసబ్, షేక్ బాజీ, భానోత్ రంగమ్మ, గూగులోతు మంగమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు.

Advertisement