చెరువులో మునిగి ఆ నలుగురు మృతి

by Sumithra |
చెరువులో మునిగి ఆ నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగుల్‌మడక తండాలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. చెరువులో నీరు అధికంగా ఉండడంతో ఒడ్డుకు చేరే దారి కనబడలేదు. ఈ క్రమంలో నీటిలో మునిగి నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గణేష్, అర్జున్, అరుణ్, ప్రవీణ్‌గా గుర్తించారు. కాగా, మరో విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story