భారీగా డ్రగ్స్ పట్టినేత..

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనిఖీల్లో 4కిలోల డ్రగ్స్ పట్టుబడగా.. దాని విలువ రూ.40లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement