కిడ్నాప్ కథ సుఖాంతం

by Shyam |
కిడ్నాప్ కథ సుఖాంతం
X

దిశ, వెబ్‎డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడేళ్ళ చిన్నారి కిడ్నాప్‌‌ను పోలీసులు చేధించారు. మహిళకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‎నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని తీసుకొని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్లింది.

ఎంజీబీఎస్ బస్టాండ్‎లో చిన్నారితో కలిసి బస్సు దిగిన మహిళను గమనించిన కిడ్నాప్ ముఠా.. ఆమె భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి భువనగిరికి తీసుకువచ్చారు. మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. మహేశ్వరి స్పృహ తప్పగానే చిన్నారిని కిడ్నాప్ చేశారు. మహేశ్వరి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో కేసును చేధించి.. కిడ్నాపర్ల చెర నుంచి బాలికను రక్షించి మహేశ్వరికి అప్పగించారు. కిడ్నాప్ చేసిన ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story