250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

by  |
250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామం నుంచి మహారాష్ట్ర నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు.ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జి. మోహన్ వెల్లడించారు.వివరాల్లోకివెళితే.. మైలారం గ్రామం నుంచి శనివారం రాత్రి టీఎస్ 16 యుబీ 5334 నెంబర్ గల లారీలో ప్రజా పంపిణీ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్సు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. లారీలో పీడీఎస్ బియ్యం గుర్తించి సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన వ్యక్తుల్లో గణపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన షేర్ల తిరుపతిని విచారించగా గత కొద్ది రోజుల నుంచి రేగొండ మండలం రామన్న గూడెం, బాగిర్తిపేట గ్రామస్థుల నుంచి బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించామన్నారు. మరల వీటిని మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి తీసుకెళ్లి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నేరం అంగీకరించాడు.ఈ బియ్యం విలువ రూ.6లక్షల వరకు ఉంటుందన్నారు. అనంతరం షేర్ల తిరుపతితో పాటు లారీ డ్రైవర్ బాక్ శంకర్, క్లీనర్ కేశవ్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు.


Next Story

Most Viewed