పది పరీక్షలకు హాజరై.. కరోనాను వెంటబెట్టుకొచ్చారు

by  |
పది పరీక్షలకు హాజరై.. కరోనాను వెంటబెట్టుకొచ్చారు
X

దిశ, వెబ్‌‌డెస్క్: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థులు కరోనాను వెంట బెట్టుకుని వచ్చారు. అప్పటికే అక్కడ కరోనా కోరలు చాస్తుండటంతో విద్యాశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. అయినా వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. తీరా చూస్తే 32 మంది పది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో శనివారం వెలుగు చూసింది.లాక్ డౌన్ తర్వాత పోస్టుపోన్ చేసుకుంటూ వచ్చిన పది పరీక్షలను అక్కడి ప్రభుత్వం ఇటీవలే నిర్వహించింది. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటిస్తూ మొత్తానికి ఎగ్జామ్స్‌ను పూర్తి చేశారు. కొద్దిరోజుల తర్వాత కొంత మంది విద్యార్థులకు టెస్టులు నిర్వహించారు. ఈ రోజు వెల్లడైన రిపోర్టుల్లో 32 మందికి పాజిటివ్ నిర్దారణ కావడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ కూడా వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందో తెలియక తలలు పట్టుకుంటోంది. అయితే, పాజిటివ్ వచ్చిన విద్యార్థుల ప్రైమరీ కాంటాక్ట్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు తరలించినట్టు సమాచారం.



Next Story