- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4,291 కేసులకు మూలం ఒకే సదస్సు : కేంద్రం
న్యూఢిల్లీ: లాక్‌డౌన్, సామాజిక దూరంలాంటి ప్రభుత్వ సూచనలను ఒక్కరు పాటించకున్నా యావత్ దేశానికీ ప్రమాదమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే మనమందరం సామాజిక దూరాన్ని పాటించాలని, లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించాలని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ఇందుకు మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ఒక సదస్సుగా ఉదాహరణ అని వివరించారు. శనివారం ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం 14,378 కేసుల్లో 4,291కేసులు (సుమారు 30శాతం) ఈ సదస్సుతో ముడిపడి ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా తమిళనాడు ఈ సదస్సుతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. ఈ రాష్ట్రంలో 84శాతం కేసులు ఈ సదస్సుతో లింక్ ఉన్నవేనని తెలిపారు. తెలంగాణలో 79శాతం కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 61శాతం కేసులు, ఢిల్లీలో 63శాతం, యూపీలో 61శాతం కేసులు ఈ సదస్సుతో లంకె ఉన్నవేనని వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయానికి) కొత్తగా 991 కేసులు నమోదయ్యాయని అగర్వాల్ వెల్లడించారు. అలాగే, 42 మరణాలు సంభవించాయని చెప్పారు. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 14,792కు, మరణాలు 488, రికవరీల సంఖ్య 2015కు పెరిగినట్టు కేంద్రం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. 23 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. గురువారం ఆయన ఈ జిల్లాల సంఖ్య 28గా తెలిపారు. అయితే, ఈ జాబితాలో కొత్తగా మరో 19 జిల్లాలు చేరాయి. కాగా, కొవిడ్ 19తోపాటు ఇతర అనారోగ్య సమస్యలకూ చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. ఆస్పత్రులను కోరినట్టు వివరించారు. శనివారం ఉదయానికి మరణాల సంఖ్య 480కి చేరిందని లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే, అందులో 75శాతం మంది 60ఏళ్ల పైబడినవారేనని వివరించారు. అలాగే, 83శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, వయసులవారీగా చూస్తే.. 480 మంది మృతుల్లో 14.4శాతం మంది 45ఏళ్లలోపు, 10.3శాతం మంది 45 నుంచి 60ఏళ్ల వయసువారు, 33.1శాతం మంది 60 నుంచి 75ఏళ్ల మధ్య వయస్కులని, 42.2శాతం మంది 75ఏళ్ల పైబడినవారని తెలిపారు.
కొవిడ్ 19ను హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎంత ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నదన్న విషయంపై అధ్యయనాన్ని మొదలుపెట్టినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంస్థకు చెందిన డాక్టర్ ఆర్ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. అయితే, దీనిపై ట్రయల్స్ చేయడం లేదని తెలిపిన ఆయన.. ఇప్పటికే ఈ మాత్రలను తీసుకున్న వైద్యారోగ్య సిబ్బందిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందులో 10శాతం మంది కడుపునొప్పి వచ్చినట్టు, ఆరుశాతం మంది వాంతులకు సంబంధించిన సమస్యను ఎదుర్కొన్నట్టు తేలిందని వివరించారు.
tags: coronavirus, cases, pandemic, fatalities, health ministry, ICMR, tablighi jamaat