- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెసేజ్ పెట్టి అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
తల్లి సెల్ ఫోన్‌కి మెసేజ్ పెట్టి ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన వైజాగ్‌లో కలకలం రేపింది. వివాఖపట్టణంలోని ద్వారకానగర్ బుధిల్ పార్క్ సమీపంలో మింది లక్ష్మి కుటుంబం నివాసం ఉంటోంది. ప్రైవేట్ కాలేజీలో మింది అనురాధ (22), తులసీ(20) చదువుతుండగా, కోమలి(17) ఇంటర్ చదవుతోంది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నామని చెప్పి సాయంత్రం బయల్దేరారు. అనంతరం తల్లి ఫోన్‌కు.. ఇంటి నుంచి వెళ్లిపోతున్నామని, చనిపోతామని, తమను వెతకవద్దని చెబుతూ మెసేజ్ పెట్టారు. దీంతో లబోదిబోమంటూ లక్ష్మి ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. మరుసటి రోజు వీరు చెన్నై చేరుకున్నామని, క్షేమంగా ఉన్నామని చెబుతూ తల్లి సెల్‌కి మరో మెసేజ్ పెట్టారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ముగ్గురూ చెన్నై ఎందుకెళ్లారు? వారినెవరైనా తీసుకెళ్లారా? లేక వారే వెళ్లారా? వంటి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.