- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
SRSP కెనాల్‌లో ముగ్గురు గల్లంతు..

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు SRSP కెనాల్‌లో జారిపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముగ్గురు స్నేహితులు కెనాల్ వద్ద సెల్ఫీలు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో బందేర కిరణ్, చొప్పరి రవి, థరూర్ గ్రామానికి చెందిన మరో యువకుడి ఉన్నట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారికోసం రెస్య్కూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story