- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రీ ఇన్ వన్ బెడ్ ఆవిష్కరించిన ఫారెస్ట్ ఆఫీసర్!
దిశ, ఫీచర్స్ : ‘ఆవశ్యకత, అవసరమే.. ఆవిష్కరణకు తల్లి’ లాంటిది. ప్రపంచం మెచ్చిన ఎన్నో ఇన్నోవేషన్స్‌కు అవే కారణం కాగా, గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన 54 ఏళ్ల కానుభాయ్ కర్కర్‌కు ఈ మాటలే ప్రేరణగా నిలిచాయి. ఆయన రూపొందించిన అద్భుత ఆవిష్కరణలు సగటు మధ్యతరగతి వ్యక్తి జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాలుగా నిలిచాయి. పాకెట్-ఫ్రెండ్లీ పద్ధతిలో తయారైన ఆ ప్రొడక్ట్స్.. మిడిల్ క్లాస్ జీవితాల్లో కాస్త విలాసాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్‌నే నమ్ముకున్న కానూభాయ్.. అందుబాటులోని వనరులతో తక్కువ ఖర్చుతో కొత్త ఉత్పత్తిని సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అతని ఇల్లే ఓ యుటిలిటీ కేంద్రంగా మారింది. అక్కడ జీవం పోసుకున్న ఎన్నో వస్తువులు శ్రమతో కూడిన పనులను సులభతరం చేస్తాయి. అలాంటి వస్తువుల్లో ‘త్రీ ఇన్ వన్ బెడ్’ ఒకటి.
త్రీ ఇన్ వన్ బెడ్ :
తక్కువ స్థలంలో నిర్మించిన ఇండ్లతో పాటు హాస్టళ్లు, ఫ్లాట్స్, పేయింగ్ గెస్ట్ రూమ్స్‌కు సంబంధించి ‘త్రీ ఇన్ వన్ బెడ్’ను లైఫ్ సేవర్‌గా చెప్పొచ్చు. ఖరీదైన పడకలకు ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ బెడ్ మూడు మంచాలను ఒకదానిలో ఒకటి జోడించినట్లుగా ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని తెరుచుకోవచ్చు, మూసివేయొచ్చు. సోఫా-కమ్-బెడ్‌గా వినియోగించుకునే వీలున్న ఈ బెడ్‌కు చక్రాలు కూడా ఉన్నందున ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. దోమతెర కోసం ప్రత్యేకంగా స్టాండ్ ఏర్పాటు కలిగివున్న ఈ బెడ్ ధర రూ. 3,500/- మాత్రమే.
‘త్రీ ఇన్ వన్ బెడ్’ బెడ్‌తో పాటు ఏకకాలంలో 25-30 మంది వ్యాయామం చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని కూడా కానూభాయ్ తయారు చేశారు. రూ. 30,000 ఖరీదు చేసే ఈ వ్యాయామ యంత్రాన్ని పరిశీలించిన గుజరాత్ గవర్నర్ అతని నైపుణ్యాలను మెచ్చుకున్నారు. తన ఇల్లు వినూత్న ఆలోచనలకు నిలయంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘శ్రేష్ఠ ఘర్’ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. ప్రస్తుతం గుజరాత్ అటవీ శాఖలో గ్రేడ్ వన్ అధికారిగా సేవలందిస్తున్న కానూభాయ్.. వచ్చే ఏడాది రిటైర్ కానున్నాడు. కాగా తన సర్వీస్‌లో మిగిలిన 52 వారాలకు గాను 52 కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న అతను.. ఇప్పటికే 15 ఇన్నోవేషన్స్ పూర్తిచేయడం విశేషం. తన ఆవిష్కరణల గురించి మరింత సమాచారం కావాలంటే అతడి YouTube చానల్ చూడొచ్చు.
సామాన్యుల కోసం ఆవిష్కరణలు..
రాత్రి, పగలు తేడా లేకుండా కొత్త ఆవిష్కరణల గురించే ఆలోచిస్తాను. రోజువారీ పనిని సులభతరం చేసే వస్తువులు కనిపెడుతూ ఇతరులకు సాయపడటమే నా ఉద్దేశ్యం. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల ఆ కష్టాలు తెలుసు. అందువల్లే జీవితంలో ఎదురైన ప్రతీ సమస్యకు పరిష్కారం వెతికేందుకు ప్రయత్నించాను. ఈ వస్తువులు మధ్యతరగతి జీవితాల్లో డబ్బు, శ్రమ, సమయంతో పాటు స్థలాన్ని కూడా ఆదా చేస్తాయి అని కానూభాయ్ చెప్పుకొచ్చారు.