- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్లోరిడాలో మరోసారి పేలిన తుపాకీ.. చిన్నారితో సహా ముగ్గురు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా లో మరోసారి తుపాకీ పేలింది. గురువారం ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం రేపాయి. ఒక గుర్తు తెలియని దుండగుడు రాయల్ పామ్ బీచ్ లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులను కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో దుండగుడితో పాటు ఒక చిన్నారి, మరో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక మహిళ, చిన్నారి తో సహా షూటర్ కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులకు గల కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉందని , ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story