- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగర్ కర్నూలు జిల్లాలో 3 కరోనా కేసులు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వెల్దండ మండలం తాండ్ర గ్రామానికి చెందిన వ్యక్తికి, నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి, బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ముగ్గురు కూడా గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులోనే నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. వీరు ముగ్గురు హైదరాబాద్ గాంధీలో చికిత్స పొందుతున్నారని వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాక అధికారులు ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తించి వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని, కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.