కాలువలో శవాలు.. ఎవరని ఆరా తీసి షాకైన పోలీసులు

by Sumithra |   ( Updated:2021-12-17 21:59:40.0  )
Hemavathi-Cannal
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్య, కూతురు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చేళూరులో ఉన్న హేమావతి కాలువలో ముగ్గురు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం సమయంలో వారి శవాలు కాలువలో తేలుతుండడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారి మృతదేహాలను కాలువలోంచి బయటకు తీసి ఆరా తీయగా.. మృతులు కేబీ క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో పని చేస్తున్న సహాయ ఇంజినీర్ రమేష్(55), ఆయన భార్య మమత(46), ఆయన కూతురు శుభ (25)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story