ఇంటి పెద్ద మృతి.. కుటుంబం మొత్తం ఆత్మహత్య

by Anukaran |   ( Updated:18 Aug 2020 10:30 PM  )
ఇంటి పెద్ద మృతి.. కుటుంబం మొత్తం ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచాన్నే కాకవికలం చేస్తున్న కరోనా సాధారణ వ్యక్తుల చావులకు కూడా కారణమవుతోంది. ఏపీలో కరోనా మహమ్మారి గద్ద రూపంలో వచ్చి ఇంటి పెద్దను ఎత్తుకెళ్లింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పసివేద గ్రామంలో పెద్దపరిమి నర్సయ్య అనే వ్యక్తి ఈనెల 16న కరోనాతో మృతిచెందాడు. దీంతో అప్పటినుంచి ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి గోదావరిలో దూకి వారు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నర్సయ్య భార్య సునీత(50), కూతురు అపర్ల(23), కుమారుడు ఫణికుమార్ (25) గా గుర్తించినట్లు సమాచారం.



Next Story

Most Viewed