అప్పుడు మాత్రమే 2 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి ‘కోవాగ్జిన్’ టీకా

by Shamantha N |
అప్పుడు మాత్రమే 2 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి ‘కోవాగ్జిన్’ టీకా
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మరి తగ్గుముఖం పడుతున్న సమయంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కీలక ప్రకటన చేసింది. రెండు నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో అత్యవసర వినియోగం కోసం హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్ -19 టీకా ‘కోవాగ్జిన్‌’కు అనుమతి తెలపవచ్చని ప్రభుత్వ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఈ విషయాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, కోవాగ్జిన్ తయారీదారు గత వారం DCGI కి రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాక ఆ సమాచారాన్ని నిపుణుల కమిటీకి సమర్పించింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed