రెండేళ్ల వరకు మారటోరియం ప్రతిపాదన : కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా వ్యాప్తి కారణంగా దేశంలోని వివిధ బ్యాంకుల్లో ప్రజలు తీసుకున్న రుణాలపై మారటోరియం సదుపాయాలన్ని మరో రెండేళ్ల పాటు పెంచేందుకు ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని భారత్ సొలిసిటర్ జనరల్ మంగళవారం సుప్రీంకోర్టుకు వివరించారు.

2021 మార్చి వరకు మరటోరియం కొనసాగిస్తామని.. వీలైతే దానిని మరో సంవత్సరం పాటు పొడిగిస్తామని కేంద్రప్రభుత్వం తరఫున వాదిస్తున్న ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం.. ‘ఈఎంఐలపై ఎలాంటి అదనపు చార్జీ లేదా పెనాల్టీ వేయకూడదని’ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.

Advertisement