సీపీఎల్‌లో బార్బడోస్ బోణీ

by Shyam |
సీపీఎల్‌లో బార్బడోస్ బోణీ
X

దిశ, స్పోర్ట్స్: టీ20 ఫార్మాట్ వచ్చాక బౌలర్ల హవా తగ్గిపోయిందని పలువురు విమర్శిస్తుంటారు. కానీ, బుధవారం ఉదయం కరేబియన్ ప్రీమియర్ లీగ్ (cpl)లో రెండో మ్యాచ్ చూస్తే విమర్శకుల నోళ్లకు తాళం పడుతుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ (Brian Lara Cricket Academy)లో బార్బొడాస్ ట్రైడెంట్ (Barbados Trident), సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్ (St. Kitts and Nevis Patriots) మధ్య మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది.

తొలుత టాస్ గెలిచిన పాట్రియట్స్ (St. Kitts and Nevis Patriots) జట్టు ఫీల్డింగ్ (Fielding) ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ట్రైడెంట్స్ (Barbados Trident)జట్టును పాట్రియట్స్ బౌలర్లు చావు దెబ్బ తీశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో కొట్రెల్ (Cottrell) రెండు వికెట్లు తీశాడు. చార్లెస్ (Charles)(4) క్లీన్‌బౌల్డ్ అవ్వగా, కోరి అండర్సన్ (Corey Anderson) (0) లూయీస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

ఇక నాలుగో ఓవర్లో సొహైల్ తన్వీర్ షాయ్ హోప్ (Sohail Tanveer Shy Hope)(3)ను అవుట్ చేయడంతో ట్రైడెంట్స్ (Barbados Trident) జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికీ ట్రైడెంట్స్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి ఎనిమిది పరుగులు మాత్రమే. ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత కెప్టెన్ హోల్డర్, కైల్ మేయర్స్ (Captain Holder, Cole Meyers) భుజానికెత్తుకున్నారు.

పాట్రియట్స్ (St. Kitts and Nevis Patriots) బౌలర్లను చితక బాదారు. నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. దూకుడు మీద ఉన్న మేయర్స్ (37) ఎమ్రిత్ బౌలింగ్‌లో హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే జాన్ కార్టర్ (0) రనౌట్ అవ్వడం, రీఫర్ (2) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ట్రైడెంట్స్ పరిస్థితి మొదటికి వచ్చింది. జాసన్ హోల్డర్ (38) అవుటైన తర్వాత శాంట్నర్ (20), రషీద్ ఖాన్ (26) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ఛేదనలో విఫలం

ట్రైడెంట్స్‌ను (Barbados Trident) తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాట్రియట్స్ (St. Kitts and Nevis Patriots) ఛేదనను నిలకడగా ప్రారంభించింది. ఓపెనర్ క్రిస్ లిన్ (Opener Chris Lynn) (19) శాంట్నర్ (Shantner) బౌలింగ్‌లో వాల్ష్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ లూయీస్ (12) అనవసర పరుగు కోసం ప్రయత్నించడంతో రషీద్ ఖాన్ (Rashid Khan) రనౌట్ చేశాడు.

డా సిల్వ, బెన్ డంక్ కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు కలసి జట్టును విజయం వైపు నడిపిస్తున్నారని భావిస్తుండగానే శాంట్నర్ మరోసారి దెబ్బ తీశాడు. శాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ ఓవర్ రెండో బంతికి బెన్ డంక్ (34) మేయర్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. డా సిల్వ (41 నాటౌట్) చివరి వరకు నిలబడి పాట్రియట్స్ St. Kitts and Nevis Patriots) విజయం కోసం చాలా కష్టపడ్డాడు.

అతడికి రామ్ దిన్ (Ram Din) (13), సొహైల్ తన్వీర్ (Sohail Tanveer)(16) అండగా నిలబడినా పరుగుల్లో వేగం లేకపోవడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 147 పరుగులే చేయగలిగారు. శాంట్నర్ (2), రషీద్ ఖాన్ (2) వికెట్లు తీయడంతోపాటు పాట్రియట్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేశారు. దీంతో పాట్రియట్స్ విజయానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. 20 పరుగులు చేయడమే కాకుండా కీలకమైన క్రిస్ లిన్, బెన్ డంక్ వికెట్లు తీసిన శాంట్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు (Player of the Match Award) లభించింది.

స్కోర్ బోర్డు:

బార్బడోస్ ట్రైడెంట్స్ బ్యాటింగ్: చార్లెస్ 4, షాయ్ హోప్ 3, కోరి అండర్సన్ 0, కైల్ మేయర్స్ 37, జాసన్ హోల్డర్ 38, కార్టర్ 0, రీఫర్ 2, శాంట్నర్ 20, నర్స్ 4, రషీద్ ఖాన్ 26 నాటౌట్, వాల్ష్ 4 నాటౌట్పాట్రియట్స్ బౌలింగ్: సొహైల్ తన్వీర్ 2, కొర్టెల్ 2, ఎమ్రిత్ 2, జోసెఫ్ 1, సోథి 1 వికెట్లు తీశారు సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్ బ్యాటింగ్: ఈవిన్ లూయిస్ 12, క్రిస్ లిన్ 19, డా సిల్వ 41 నాటౌట్, బెన్ డంక్ 34, రామ్‌దిన్ 13, హామిల్టన్ 0, సొహైల్ తన్వీర్ 16 నాటౌట్ట్రైడెంట్స్ బౌలింగ్: శాంట్నర్ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు

Advertisement

Next Story