ఆర్మీ ఏరియాలో డ్రగ్స్‌ కలకలం..

by Sumithra |
ఆర్మీ ఏరియాలో డ్రగ్స్‌ కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దుల్లో నిత్యం ఉగ్ర దాడులు-భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లు సర్వ సాధారణమే. కానీ, జమ్ము కశ్మీర్‌లోని హిరానగర్‌ సెక్టార్‌లో బుధవారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 135 కోట్లు విలువ చేసే 27 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. భారత సరిహద్దు వెంబడి ఓ స్మగ్లర్ డ్రగ్స్‌ను తరలిస్తుండగా భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్మగ్లర్ మృతి చెందగా.. అతడి నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story