కోదాడలో 22 పాజిటివ్ కేసులు..

by Shyam |   ( Updated:2020-08-12 07:23:48.0  )
కోదాడలో 22 పాజిటివ్ కేసులు..
X

దిశ, కోదాడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో 12 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. 34 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా సోకినట్టు తెలిపారు.

దీంతో అధికారులు పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టయిన వారి వివరాలు సేకరించి పనిలో పడ్డారు. అలాగే అనంతగిరి, మునగాల మండలాల్లో, అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 6 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు స్పష్టం చేశారు. అందులో ద్వారకుంట 2, గోళతాండ 1, కృష్టాపురం 1, కోదాడ 1, వెంకటరామాపురం 1, నమోదైనట్టు వైద్యాధికారి డాక్టర్ సుధీర్ చక్రవర్తి వెల్లడించారు. అలాగే మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 టెస్టులు చేయగా 4 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు డాక్టర్ యాద రమేష్ తెలిపారు.

Advertisement

Next Story