- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ రెండు వేలు దాటిన కొత్త కేసులు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందంటూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించినా ఇంకా ప్రతీరోజు రెండు వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనూ, పక్కనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ కేసుల తీవ్రత తగ్గలేదు. రాష్ట్ర బులెటిన్ ప్రకారం గడచిన 24గంటల వ్యవధిలో అన్ని జిల్లాల్లో కలిపి 2,154 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ నగరంలో 303, రంగారెడ్డి జిల్లాలో 205, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 187, నల్లగొండ జిల్లాలో 124, ఖమ్మం జిల్లాలో 121, కొత్తగూడెంలో 92, కరీంనగర్ జిల్లాలో 96 చొప్పున పెరిగాయి. తాజాగా ఎనిమిది మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,189కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.04 లక్షలు దాటగా, రికవరీ కేసుల సంఖ్య 1.77 లక్షలు దాటింది. ఇంకా 26వేలకు పైగా యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.