బీహార్‌‌కు ఏమైంది.. 24 గంటల్లో 21 మంది మృతి

by Shamantha N |
బీహార్‌‌కు ఏమైంది.. 24 గంటల్లో 21 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో పిడుగుల వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులపాటుకు 21 మంది మృతి చెందారు. లఖిసరయి, గయ, బంకా, జాముయ్, సమస్తీపూర్, వైశాలీ, నలంద, బోజ్‌పూర్ జిల్లాల్లో భారీగా పిడుగుల వర్షం పడి 21 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా పక్రటించారు సీఎం నితీశ్‌కుమార్. కాగా, ఇప్పటివరకు బీహార్‌లో పిడుగుల దాటికి 90 మంది బలైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story