- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ భూమ్మీద అత్యంత దురదృష్టవంతుడు రోహిత్ శర్మనే అంటూ కామెంట్స్ చేసిన ట్రావిస్ హెడ్
దిశ,వెబ్ డెస్క్: కోట్లాది మంది అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. ఈ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటితో మైదానాన్ని వీడాడు. విరాట్ కోహ్లి సైతం విషాద వదనంతో కనిపించాడు.
భారత్ ఓటమికి, ఆస్ట్రేలియా విజయానికి ప్రధాన కారణం ట్రావిస్ హెడ్. ముందుగా రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకొని భారత్ జోరుకు హెడ్ బ్రేకులేసాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన హెడ్.. 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. విజయానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఫైనల్లో అద్భుతమైన ఆటతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో బాధపడుతున్న రోహిత్ శర్మను ఓదార్చేలా హెడ్ మాట్లాడాడు. ‘బహుశా ఈ భూమ్మీద ఇప్పుడు అత్యంత దురదృష్టవంతుడు రోహిత్ శర్మనే కావచ్చు. అతడి క్యాచ్ అందుకోవడం గొప్పగా అనిపించింది. ఆ క్యాచ్ నేను పట్టకపోయి ఉండుంటే.. అతడు సెంచరీ చేసేవాడేమో’ అని హెడ్ అభిప్రాయపడ్డాడు.
- Tags
- rohit sharma