IND vs PAK : మైదానం నుంచి బయటకు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?

by Shiva |   ( Updated:2023-10-14 12:58:57.0  )
IND vs PAK : మైదానం నుంచి బయటకు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ల జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు తొందరలో విరాట్ ఒక జెర్సీకి బదులు మరొక జర్సీని ధరించి మైదానంలోకి వచ్చాడు. మాములుగా మ్యాచ్‌కు ధరించే జెర్సీపై జాతీయ పతాకంలోని త్రివర్ణ చారలు ఉంటాయి. అదే మాములు జెర్సీపై ఆ చారలు ఉండవు. దీంతో గమనించిన జట్టు సహచరులు విషయాన్ని కోహ్లీ చెప్పగా అతడు గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూంకు వెళ్లి మరో జెర్సీ మార్చుకుని తిరిగి మైదానంలోకి దిగాడు.


Next Story