- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్కంఠంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఫన్నీ ఇన్సిడెంట్.. గమనించారా? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతోంది. టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేధించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. తొలి ఇన్సింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో కోహ్లీ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు.
అయితే బంతి నేరుగా మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ దగ్గరికి వెళ్లింది. అయితే మాక్సీ వికెట్ కీపర్ త్రో వేసే క్రమంలో బంతి మిస్ అయ్యి విరాట్ కోహ్లీ పైకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కోహ్లీ బంతిని చేతితో పట్టుకున్నాడు. మ్యాక్సీ కూడా కోహ్లీ వైపు చూస్తూ క్షమాపణలు చెబుతున్నట్లుగా చూశాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ దగ్గరకు కోహ్లీ వెళ్లి సీరియస్‌గా చూస్తూ నవ్వాడు. మ్యాక్సీ కూడా సరదాగా స్మైల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.