2021లోనూ కరోనా ప్రభావం : AIMS

by  |
2021లోనూ కరోనా ప్రభావం : AIMS
X

కరోనా వైరస్ వ్యాప్తి 2021 తొలినాళ్లలోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIMS) డైరెక్టర్‌, భారత్‌ కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో జన సంచారం పెరగడంతో పాటు గ్రామాలకు వైరస్ పాకడం, కరోనా పరీక్షలను పెంచిన నేపథ్యంలో 2021లోనూ కొన్ని నెలల పాటు కేసులు పెరుగే ఛాన్స్ ఉందని తెలిపారు.

ఆ తర్వాత కేసుల పెరుగుదల నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందని.. ఒక నిర్దిష్ట రేటులో కొంతకాలం పాటు ఇన్ఫెక్షన్ల వ్యాప్తి కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. మొత్తం మీద వచ్చే ఏడాది మధ్యలో కరోనా వ్యాప్తికి తెరపడొచ్చని వెల్లడించారు. ఇదిలాఉండగా, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి రెండోదశకు చేరిందని వివరించారు.



Next Story