- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి టెలికాం టారిఫ్‌ల పెంపు!
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్పు పెంపు, అధిక డేటా వినియోగం నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీల ఆదాయం 13 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా రాబోయే నెలల్లో టెలికాం కంపెనీలు మరోసారి సుంకాలను పెంచే అవకాశం ఉందని, ఇది టెలికాం రంగం ఆదాయాన్ని పెంచుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల టెలికాం సేవల వాడకం మరింత పెరగనుంది.
వీడియో కంటెంట్‌లను చూసే వినియోగదారులు పెరగనున్నారు. అధిక వినియోగం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఇక్రా అభిప్రాయపడింది. డేటా అవసరాలు పెరుగుతున్న క్రమంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు 2జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ అవుతున్నారు. దీంతో టెలికాం కంపెనీలు ఆర్పు పెంపు నిర్ణయాన్ని తీసుకోక తప్పటంలేదని ఇక్రా పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ మద్దతు కూడా టెలికాం రంగానికి తోడ్పడే అవకాశం ఉందని ఇక్రా వెల్లడించింది. అదే సమయంలో డేటా కోసం ఫ్లోర్ టారిఫ్‌లను ప్రవేశపెట్టడం, స్పెక్ట్రమ్ చెల్లింపుల్లో మరింత సడలింపులను నుంచి టెలికాం రంగం ప్రభుత్వ మద్దతు కోరుతోంది.