బయో సెక్యూర్‌లో ఆస్ట్రేలియా ఓపెన్

by  |
బయో సెక్యూర్‌లో ఆస్ట్రేలియా ఓపెన్
X

దిశ, స్పోర్ట్స్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను బయో సెక్యూర్ వేదికలో నిర్వహిస్తామని, పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆలస్యంగా అయినా యూఎస్, ఫ్రెంచ్ ఓపెన్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీల నిర్వహణ తీరును పరిశీలించి, వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమలు చేస్తామని అంటున్నారు. విదేశీ ఆటగాళ్లను కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచుతామని నిర్వాహకులు స్పష్టం చేశారు. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను 8,21,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. కానీ, ఈ ఏడాది ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోనుండటంతో గేట్ ఆదాయం తగ్గిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వారంలోనే ఆస్ట్రేలియా ఓపెన్ షెడ్యూల్, ఇతర విషయాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరిస్తామని టెన్నిస్ ఆస్ట్రేలియా సీఈఓ క్రెయిగ్ టిలే స్పష్టం చేశారు.



Next Story