బడ్జెట్ హైలైట్స్: పెట్టుబడుల ఉపసంహరణకు డ్యాష్ బోర్డు

by Anukaran |   ( Updated:2023-03-20 18:13:28.0  )
బడ్జెట్ హైలైట్స్: పెట్టుబడుల ఉపసంహరణకు డ్యాష్ బోర్డు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. రూ.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి అన్నారు. అదేవిధంగా 1938 బీమా చట్టానికి సవరణ చేసిన కేంద్రం.. బీమా కంపెనీల్లో 49శాతం నుంచి ఎఫ్‌డీఐల పరిమితి 74శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

బడ్జెట్ హైలైట్స్…

  • రైల్వేలకు రూ.1,10,055 కోట్లు
  • వెయ్యి మండీలను ఈనామ్‌తో అనుసంధానం
  • వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.5లక్షల కోట్లు
  • రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల పెట్టుబడి వరకు చిన్న సంస్థలుగా గుర్తింపు
  • గెయిల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
  • ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణతో రూ.1.75లక్షల కోట్లు సమకూరాయని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

బడ్జెట్ హైలైట్స్…

  • ఈ ఏడాది జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో
  • మూలధన సాయం కింద ప్రభుత్వ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
  • కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయం 120రోజులకు కుదింపు
  • బ్యాంకులు మొండి బకాయిల కోసం ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ సంస్థ ఏర్పాటు

కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వాటా ప్రకారం రేషన్ తీసుకునే సౌకర్యం

Advertisement

Next Story

Most Viewed