ఇండియన్ గోల్ఫ్ టోర్నీ రద్దు

by Shyam |
ఇండియన్ గోల్ఫ్ టోర్నీ రద్దు
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి దెబ్బకు మరో క్రీడా ఈవెంట్ రద్దయ్యింది. గతంలోనే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ‘ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్’ను ఈ ఏడాదికి రద్దు చేస్తున్నట్లు భారత గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) చైర్మన్ దేవాంగ్ షా ఒక ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ గోల్ఫ్ టూర్‌లో భాగంగా జరిగే ఇండియన్ ఓపెన్ మార్చి 19 నుంచి 23 వరకు గురుగ్రామ్‌లో జరగాల్సి ఉంది. అప్పటికే కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో టోర్నీని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అయినా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండటంతో పూర్తిగా రద్దు చేశారు. ‘ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్‌ ఓపెన్‌ను రద్దు చేస్తున్నాం. యూరోపియన్‌ టూర్‌ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని దేవాంగ్‌ షా అన్నారు. వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం జరుగుతందా లేదా అనే విషయం తర్వాత బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని అన్నారు.

Advertisement

Next Story