- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుంటూరులో ప్రైవేటు బస్సు బోల్తా..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారులు సీటులో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అద్దాలు పగులగొట్టి చిన్నారులను రక్షించారు.
బస్సు చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story